ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > నవగ్రహ దీపాల నోమును ఆచరించండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నవగ్రహ దీపాల నోమును ఆచరించండి
FILE
కార్తీక మాసంలో నవగ్రహ దీపాల నోమును ఆచరించినట్లైతే...అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ నోములో నవగ్రహాలదే ప్రధాన తాంబూలం. కార్తీక మాసంలో మూడు రోజుల పాటు ఈ నోమును నిష్ఠనియమాలతో పాటిస్తారు.

ముందుగా... ఆదిపూజ్యుడైన గణపతి ఆరాధన చేసి, ఆ తర్వాత శివలింగార్చన చేయాలి. తర్వాత నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై దీప ప్రమిదల నుంచి "ఓం నమఃశివాయ" మంత్రాన్ని 108 సార్లు స్మరించాలి.

తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మిదిమంది బ్రాహ్మణులకు ఆ దీపాలను మనస్ఫూర్తితో.. ఇష్టదైవాన్ని స్మరించుకుని దానం చేయాలి. ఈ నోమును శుభతిథులలో సాయంత్రం సమయాన మాత్రమే చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

నోము పూర్తయిన తర్వాత అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి, కుటుంబంలోని సభ్యుల శిరస్సుపై చల్లుకోవాలి. ఈ నోమును నియమాలతో మూడు రోజుల పాటు ఆచరించినట్లైతే ఆ గృహంలో సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పుణ్య ఫలం.. కార్తీక స్నానం...  
మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించండి
శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించండి  
కార్తీక పౌర్ణమి నేడే... శివాలయాలకు వెళ్లండి.  
పుణ్యఫలం కోసం "కార్తీక వ్రతాన్ని" ఆచరించండి
కార్తీక సోమవారంలో దీపారాధన చేయండి