కార్తీకమాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి పుణ్యవ్రతాన్ని ఆచరిస్తే పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. కార్తీక పుణ్యదినాలలో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సర్వభోగభాగ్యాలు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని నమ్మకం. రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ వ్రతాచరణ ఒక విధి. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగా... కార్తీకమాసంలోని ఏదేని ఓ శుభ దినాన నదీ స్నానమాచరించి.. ఇంటిని శుభ్రం చేసి... పూజా గదిని పసుమ కుంకుమలతో అలకరించుకోవాలి.ఇంటి ముంగిట అందమైన ముగ్గులు పెట్టి నిష్ఠనియమాలతో వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వ్రతాన్ని పాటించే వారు శివాలయాలను, వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే... పుణ్యఫలములు ప్రాప్తిస్తాయి. ఆ సత్యనారాయణ స్వామి కొరువుతీరిన క్షేత్రమైన అన్నవరాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రాజమండ్రికి దాదాపు 80 కి. మీ., అన్నవరం స్టేషను నుండి 3 కి.మీ. దూరంలో... పంపానదీ తీరంలో ఉన్న కొండ రత్నగిరి. ఈ రత్నగిరిపై వెలిసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం "అన్నవరం సత్యనారాయణ దేవాలయం" గా ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని కార్తీక మాసంలో దర్శించుకుంటే పాపాలు తొలగిపోయి... మోక్ష మార్గం లభిస్తుంది. |