శుక్రవారం పూట అమ్మవారిని ఎరుపు పువ్వులతో స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంటిని, పూజా మందిరమును శుభ్రం చేసి, గడపకు పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారిని నిష్టతో పూజించినట్లే కుటుంబ క్షేమం మెరుగవుతుందని పురోహితులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం మహిళలు శుచిగా స్నానమాచరించి, ఒక పూట భోజనం చేసి అమ్మవారిని నిష్టతో పూజిస్తే సర్వ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది. పూజ చేసే సమయంలో దుర్గా స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. అలాగే శుక్రవారం పూజలో తెలుపు రంగు పుష్పాలను ఉపయోగిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. ఇంకా.. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు పసుపు కుంకుమలు, ముగ్గులతో అలంకరించబడిన పూజామందిరం, గడపపై ఎర్రటి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. |