ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేవడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. సూర్యోదయ సమయాన భూమిపై పడే కిరణాలు శక్తివంతమైనవి. ఈ కిరణాలు మన శరీరంపై పడితే నరాలకు కొత్త ఉత్తేజం కలుగుతుందని పండితులు అంటున్నారు. అంతేగాకుండా సూర్యోదయ కిరణాలు మన శరీరంపై పడితే కొత్త ఉత్సాహం చేకూరుతుందని వారు చెబుతున్నారు.ఈ కారణంతోనే ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం మంచిదని పెద్దలంటూ ఉంటారు. సూర్య నమస్కారం చేయడం ద్వారా ఆ కిరణాల ప్రభావంతో దేహబలం, కంటి ఆరోగ్యం కూడా చేకూరుతుందని పండితులు అంటున్నారు.ఇకపోతే... శనివారం సూర్యోదయానికి ముందే లేచి, నువ్వుల నూనెతో తలస్నానం చేసి సూర్యనమస్కారం చేసే వారికి ఈతిబాధలు, శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. |