మంగళవారం పూట దుర్గాదేవిని స్తుతిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులను ధరించడం శ్రేయస్కరం.యాపిల్, ఆరంజ్ పండ్ల రసాలను మంగళవారం పూట తీసుకోవడం మంచిది. ఈ పండ్ల రసాలతో పాటు కందులతో తయారు చేసే వంటకాలు భుజించడం ద్వారా శరీరానికి కొత్త ఉత్తేజం చేకూరుతుందని పురోహితులు అంటున్నారు.మంగళవారం పూట మహిళలు నిష్ఠతో దుర్గాదేవిని ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుంది. ఈ రోజున మహిళలు ఎరుపు రంగు పువ్వులను తలలో ధరిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా మంగళవారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి లేదా కుమార స్వామి వారి ఆలయ దర్శనం గావించి ఎరుపు రంగు పువ్వులను స్వామికి సమర్పించి స్తుతించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.అంతేగాకుండా నిష్ఠతో విష్ణుస్తుతి, దుర్గాష్టకంను స్తుతించి, ఆలయాల్లో నేతితో దీపమెలిగించే వారికి అష్టైశ్వర్యాలు, దీర్ఘాయుష్షు చేకూరుతుందని పురోహితులు అంటున్నారు. |