బుధవారం పూట రాజరాజేశ్వర వ్రతాన్ని ఆచరించడం మంచిదని పండితులు అంటున్నారు. బహుళాష్టమి, బుధవారం, స్వాతీ నక్షత్ర యోగంలో చేసే ఈ వ్రతానికి చాలా విశిష్టత ఉందని వారు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని ప్రతి బుధవారం ఆచరించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. బుధవారం సూర్యోదయానికి ముందే లేచి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని ముగ్గులు, పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. అనంతరం స్త్రీలు నుదుట సింధూరం పెట్టుకుని శివపార్వతులను మనసారా ధ్యానించాలి.ఈ వ్రతానికి గ్రహాష్టోత్తరం పారాయణం అవసరం లేదు గానీ, రుద్రాష్టకం, లింగాష్టకం, విశ్వనాథాష్టకం పారాయణ చేస్తూ.. బిల్వం లేదా ఏదేని తెల్లరంగు పువ్వులతో పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా బుధవారం, శుద్ధాష్టమి, రోహిణి నక్షత్రాన పార్వతీ పరమేశ్వరుల పూజతో పాటు బుధాష్టోత్తరం చేయడం మంచిది. ఈ పూజకు తులసి దళాలను ఉపయోగించడం శ్రేయస్కరం. బుధవారం నాడు శుచిగా పార్వతీ పరమేశ్వరులను కొలిచిన వారికి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పురోహితులు చెబుతున్నారు. |