గురువారం సాయిబాబును స్మరించడం ఎంతో మంచిదని పురోహితులు అంటున్నారు. అదేవిధంగా గురుభగవానుడికి ప్రీతికరమైన ఈ రోజున సపోటా జ్యూస్ తాగడం ఆరోగ్యానికి కొత్త తేజం చేకూరుస్తుందని పండితులు అంటున్నారు. గురువారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి సాయిభగవానుడిని లేదా, శివ పరమాత్మను నిష్టతో ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని, అనుకున్న కార్యం నెరవేరుతుందని పురోహితులు చెబుతున్నారు. గురువారం గురువునకు ప్రీతికరమైన శెనగలతో నైవేద్యం సమర్పించి, అదే శెనగలతో చేసిన పిండి వంటలు భుజించడం మంచిది. అదేవిధంగా సపోటా రసంతో పాటు జామ పండ్లు భుజించడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.ఇకపోతే.. గురువారం మహిళలు, పురుషులు సాయిబాబా లేదా శివునికి వెళ్లే సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించాలి. గురువారమంతా పసుపు రంగు దుస్తులు ధరించినా శుభ ఫలితాలుంటాయి.ఇంకా మహిళలైతే పసుపు రంగు పువ్వులను శిరస్సున ధరించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. |