ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్ల గర్భగుడిలోకి శుక్రవారం ఉదయం కాకి ప్రవేశించింది. దీంతో ఆలయ అర్చకులు దర్శనం నిలిపివేశారు. కాకి గర్భగుడిలో ప్రవేశించడాన్ని అరిష్టంగా భావించిన అర్చకులు ఆలయ సంప్రోక్షణ చేశారు. దీంతో ప్రత్యేక పూజలకు, దర్శనానికి అంతరాయం కలిగినా, సంప్రోక్షణ అనంతరం పూజలకు, దర్శనానికి అనుమతి కల్పించారు.ఇదిలా ఉంటే.. మనం నివసించే గృహంలోకి కాకి ప్రవేశిస్తేనే ఏడేళ్ల పాటు ఆ ఇంటిని మూతపెట్టాలని పండితులు అంటున్నారు. ఆ గృహంలో కాపురం చేయడం మంచిది కాదని వారు సూచిస్తున్నారు. కాకి ప్రవేశించిన గృహంలో నివసిస్తే ఎన్నో ఇక్కట్లు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు అంటున్నారు. గృహంలో కాకి ప్రవేశం అనర్ధాలకు దారితీస్తుందని పురోహితులు చెబుతున్నారు. అయితే కాకి ప్రవేశించిన గృహంలో గో పంచితం, గోవు పాలు, గోవు నెయ్యి, చందనం వంటి తదితర పవిత్ర ద్రవ్యాలతో సంప్రోక్షణం చేసి, పితృదేవతలను సంతృప్తి పరచి మరలా గృహ ప్రవేశం చేయడం మంచిదని పురోహితులు సూచిస్తున్నారు.సాధారణంగా గృహంలోకి కాకి ప్రవేశించడమే పలు అనర్థాలకు దారితీస్తుందని జ్యోతిష్యులు అంటున్న నేపథ్యంలో.. ప్రసిద్ధ శైవక్షేత్రం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ గర్భగుడిలోకి కాకి ప్రవేశించడం పట్ల అర్చకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి..! |