ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > నేడే శ్రావణ శుక్రవారం.. అమ్మవారిని దర్శించుకోండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేడే శ్రావణ శుక్రవారం.. అమ్మవారిని దర్శించుకోండి
WD
శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారిని కొలిచే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.

గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.

ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారమైన నేడు (జూలై 24వతేదీ) అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

అందుచేత తొలి శ్రావణ శుక్రవారమైన నేడు అమ్మవారి దేవాలయాలను సందర్శించడం శ్రేయస్కరం. ఇంకా మహిళలు పసుపు, కుంకుమలను ముత్తైదువులకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భర్తకు కూడా "రాఖీ" కట్టవచ్చునట..!
ఆ శివాలయంలో ముస్లింలే అర్చకులు..!
"వ్యాసపూర్ణిమ" రోజున ఇలా పూజ చేయండి
వ్యాసపూర్ణిమ రోజున విష్ణుపూజ చేయండి
రథయాత్రకు వెళ్లలేక పోతున్నారా? అయితే ఇలా చేయండి.
ఏ పుష్పాలతో దేవతలను పూజిస్తున్నారు?