హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » కథనాలు » 'ఇంద్ర మాల'ను ధరిస్తే.. మీకు దుస్సాధ్యమేదీ లేదు (Indo-Nepal | Rudraksha | Organisation |)
 
WD
WD
రుద్రాక్ష అంటే.. మహాశివుని నేత్రం అని శివపురాణం పేర్కొంటోంది. ఇలాంటి రుద్రాక్ష మాలలను ధరించడం వల్ల మనస్సు ప్రశాంతతో పాటు.. ఆయురారోగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెపుతున్నాయి.

అయితే ఈ రుద్రాక్ష మాలలను ధరించే ముందు అవి ఖచ్చితమైన ముఖాలను కలిగివున్నాయా? లేదా నిజమైన రుద్రాక్షలేనా అనే విషయాన్ని నిర్థారించుకోవాలి.

రుద్రాక్షల్లో అరుదైన రుద్రాక్షలను మనకు అందుబాటులో దొరకవు. అయితే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రుద్రక్ష నిపుణుడు డాక్టర్ జి.పాండురంగారావు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. చెన్నయ్‌లో ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇండోనేపాల్ రుద్రాక్ష ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఈనెల 30వ తేదీ గురువారం నుంచి ఆరంభమైన ఈ ప్రదర్శన ఆగస్టు ఆరో తేదీ వరకు జరుగుతుంది. ఇందులో ఏక ముఖి నుంచి 21 ముఖాల రుద్రాక్షలు ఇక్కడ ప్రదర్శన, విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

దీనిపై పాండురంగారావు మీడియాతో మాట్లాడుతూ.. తాము రుద్రాక్షలను హిమాలయాలతో పాటు నేపాల్, ఇండోనేషియా దేశాల నుంచి సేకరిస్తామని చెప్పారు. ఈ ప్రదర్శనలో పది రూపాయల విలువ చేసే రుద్రాక్షల నుంచి రూ.75 లక్షలు విలువ చేసే రుద్రాక్ష మాలల ప్రదర్శనలో ఉంచినట్టు చెప్పారు.

ముఖ్యంగా.. ఇక్కడ ఉంచిన ఇంద్ర మాల అత్యంత ప్రముఖమైన, ఖరీదైన మాలగా చెప్పారు. లాగే, ఏక ముఖి నుంచి 21 ముఖి మాలలు ధరించడం వల్ల కలిగే లాభాలను కూడా ఆయన వివరించారు.

* ఏకముఖి రుద్రాక్ష : ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి,
WD
WD
సంపద చేకూరతాయి.


* ద్విముఖి : అర్థనారీస్వరతత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.

* త్రిముఖి : ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుందని చెప్పారు.

* చతుర్ముఖి : బ్రహ్మకు ప్రాతినిథ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి.

* పంచముఖి : గుండె జబ్బులున్నవారికి మంచిది. పాము కాటు నుంచి రక్షణ లుగుతుంది.
* షణ్ముఖి : కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
* సప్తముఖి : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం దూరంగా ఉంటారు.
* అష్టముఖి : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
* నవముఖి : భైరవునికి ప్రతీక. దీన్ని ఎడమ చేతికి ధరిస్తే మేలు కలుగుతుంది.
* దశముఖి : దీన్ని ధరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

* ఏకాదశముఖి : 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.
* ద్వాదశముఖి : 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.
* త్రయోదశముఖి : కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.
* చతుర్ధశముఖి : 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.
* పంచదశముఖి : ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.
* షోడశముఖి : 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.

* సప్తదశముఖి : దీని వలన సంపద కలుగుతుంది.
* అష్టాదశముఖి : 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.
* ఏకోన్నవింశతిముఖి : ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.
* వింశతిముఖి : 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతంగా చెపుతారు.
* ఏకవింశతిముఖి : 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయని ఆయన వివరించారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.