హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » కథనాలు » చంటిపిల్లల తల్లిదండ్రులకు మహాద్వార ప్రవేశం రద్దు? (Tirumala| Tirupati| Infants| Parents| Mahadwara Darshan| Cancel)
Feedback Print Bookmark and Share
 
Child
FILE
చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనార్థం అమలు చేసిన మహాద్వార ప్రవేశాన్ని రద్దు చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది.

బుధవారం తిరుమలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ డీకే ఆదికేశవులు ఈ విషయాన్ని సూత్రప్రాయంగా తెలిపారు. మహాద్వార దర్శనానికి బదులు బుధవారం నుంచి తితిదే అమలు చేసిన శీఘ్రదర్శనం క్యూలైన్లలో వీరిని అనుమతించాలని భావిస్తున్నారు.

మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ప్రారంభమయ్యే శీఘ్రదర్శనం క్యూలైన్‌లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఉండటమే గాకుండా.. ఈ మార్గంలో వారిని అనుమతించడంవల్ల లగేజీ స్కానింగ్ కూడా సాధ్యపడుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఛైర్మన్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. శ్రీవారి ఘంటారావాన్ని బుధవారం నుంచి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించారు. స్వామివారి నివేదన ఘంటానాదాన్ని ఉదయం, రాత్రి ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.