హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » కథనాలు » కార్తీక సోమ, మంగళవారాల్లో నేతితో దీపమెలిగించండి (Karthika| Monday| Tuesday| Siva| Parvathi Devi| Light| Temples| Women)
Feedback Print Bookmark and Share
 
Light
FILE
సాధారణంగా ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే మాసానికి వస్తుంది. అలా కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి 'కార్తీకమాసమ'ని పేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది.

అలాగే కార్తీక మాసాల్లో వచ్చే సోమవారాల్లో మాత్రమే గాకుండా, మంగళవారాల్లో పెళ్లికాని అమ్మాయిలు, వివాహితులైన మహిళలు గౌరీదేవిని నిష్టతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

కార్తీక మాసంలో వచ్చే సోమవారం శివునికెంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించేవారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతీరోజూ ఆదిదంపతులను ప్రార్థించేవారికి ఈతిబాధలు తొలగిపోతాయి.

అందుచేత కార్తీక సోమ, మంగళవారాల్లో వివాహిత, అవివాహితులు శివాలయాలకు చేరుకుని, నేతితో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు. అంతేగాకుండా.. వివాహం, సుఖసంతోషాలు, సకలసంపదలు, వాహనయోగం వంటివి చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.