చేసే పనిలో భగవద్దర్శనం చేసుకోండి: శ్రీ కృష్ణ పరమాత్మ
శుక్రవారం, 27 జనవరి 2012( 14:09 IST )
FILE
పూజలు, పునస్కారాలు చేయడానికి మాకు సమయం ఎక్కడుంది. పొద్దున్నే పనికి వెళ్ళి ఏ రాత్రికో ఇంటికి చేరుకునే మేము పూజలు ఎలా చేయగలం? అనే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
ఇందుకు సమాధానం శ్రీ కృష్ణ పరమాత్మే చెప్పాడు. "ప్రతి మనిషి ఏదో ఒక పని చేయక తప్పదు. ప్రతి కర్మకూ దైవం ఒక కారణంగా ఉంటాడు". అని ఆయన చెప్పాడు.
ఆయన మాట ప్రకారం, చేస్తున్న పనులనే భగవంతుని ఆరాధించడంగా భావించి తరించిన భక్తులెందరో ఉన్నారు. కబీర్ వంశవృత్తి నేత నేయడం. నేత పనిలో నిమగ్నమైనప్పుడు కూడ కబీర్ మనసు భగవంతునియందే నిమగ్నమై వుండేది.
చెప్పులు కుట్టే వృత్తిని చేసుకుంటూనే రోంథాస్ రామ నామాన్ని జపిస్తుండేవాడు. గోరా అనే కుమ్మరి ఎప్పుడూ పాండురంగని నామాన్ని జపిస్తూ కుండలు చేసే వాడు.
శివభక్తుడైన నందనార్ కొద్దిమంది బాలుర సాయంతో చెరువును తవ్వడం మొదలెట్టేడు. అంతే చూస్తుండగానే వందలాది శివగణాలే కూలీల రూపంలో వచ్చి, ఆ పనిని శీఘ్రగతిన ముగించేసారు. అందుచేత చేసే పనిలో భగవద్దర్శనం చేసుకోండి.