ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » కథనాలు » డాలర్ శేషాద్రి పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు: తితిదే (Dollor Seshadri | ttd | Tirumala | Tirupati | Padamavathy College)
డాలర్ శేషాద్రి పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు: తితిదే
సోమవారం, 25 జూన్ 2012( 16:29 IST )
FILE
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సమావేశంలో డాలర్ శేషాద్రి పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఇదే డాలర్ శేషాద్రికి పదవీకాలం పొడిగించడమని తితిదే వివరణ ఇస్తోంది. డాలర్ శేషాద్రిని పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పాలకమండలి ఓ.ఎస్.డిగా నియమించి.. ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తూ రావడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
2006లో వచ్చిన 300 డాలర్ల గల్లంతు కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న శేషాద్రిని సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో మరో రెండేళ్ల పాటు పదవీ కాలంలో టీటీడీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక టీటీడీ పాలకమండలి డాలర్ శేషాద్రికి మరో రెండేళ్ల పాటు పదవీ కాలం పొడిగించడంతో పాటు * నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి నాలుగు కోట్లు కేటాయించింది * 107 కాంట్రాక్ట్ పోస్టులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది * స్వామి లడ్డూతో పాటు ప్రసాదాల తయారీకి నెయ్యి కొనుగోలుకు రూ.80 కోట్లను కేటాయించింది. * పద్మావతి డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ.7 కోట్లు కేటాయించింది. * పెంచల కోనలో భక్తుల వసతుల కోసం రూ. 3.90 కోట్లు * 365 వేద పాఠశాల పోస్టుల భర్తీకి ఆమోదం * కళ్యాణ కట్టలో నూతనంగా 320 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. * వైకుంఠం-టూ వంటశాల కోసం రూ.3కోట్లు కేటాయించింది * జూలై 15న 340 గదుల నందన అతిథి గృహం ఏర్పడింది. * కురుక్షేత్ర ఆలయ నిర్మాణానికి తితిదే తరపున రూ.18 కోట్లను టీటీడీ కేటాయించింది.