హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | సంక్రాంతి | మహాశివరాత్రి | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి | శ్రీఖర నామ సంవత్సర ఉగాది
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » కథనాలు » శ్రీకృష్ణుడి నిర్యాణానికి కారకులు ఎవరు....?
FILE
అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి శ్రీకృష్ణుడిని, రుక్మిణిని పరీక్షించాలని భావిస్తాడు. భుజించేందుకు అన్నం, పాలు కావాలని కోరతాడు. భోజనం పూర్తయ్యాక మిగిలిన పాలు, అన్నాన్ని శరీరం అంతా పూసుకోవాల్సిందిగా శ్రీకృష్ణుడికి చెప్తాడు. శ్రీకృష్ణుడు నమ్రతగా దుర్వాసుని ఆదేశాలు అమలు జరుపుతాడు. పాదాల అడుగున మినహా మిగతా శరీరం అంతా రాసుకుంటాడు.

శ్రీకృష్ణుడి చర్యతో సంతుష్టుడైన దుర్వాస మహర్షి అన్నం, పాలు రాసిన శరీర భాగాలేవీ కూడా మృత్యువాతకు కారణమయ్యే గాయాలకు లోను కాబోవని వరం ఇస్తాడు. ఒక రోజు శ్రీకృష్ణుడు అడవిలో నిద్రిస్తుండగా ఓ వేటగాడు అతని పాదాల్ని జింక చెవులుగా భ్రమించి పాదానికి బాణం సంధిస్తాడు. తప్పు తెలుసుకుని వేటగాడు శోకిస్తాడు. అయితే అప్పటికే జాప్యం జరుగుతుంది.

దుర్వాసుని వరం అమలుకాని శరీర భాగానికి గాయం తగులుతుంది. ఈ గాయంతో శ్రీకృష్ణుడు నిర్యాణం చెంది వైకుఠానికి వెనుదిరుగుతాడు. అవతార కార్యాలు ముగుస్తాయి.
సంబంధిత సమాచారం
Feedback Print