ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > క్రైస్తవ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రేమకు ప్రతిరూపం... క్రీసు జీవనం
FileFILE
ఆ రాత్రి ఆ ఊరికి ప్రక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెలకాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, భయపడకండి. ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవ్వాళ బెత్లెహేములోని ఒక పశువులపాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు అని చెప్పాడు.

దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతి గీతాలు పాడి మాయమైనారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పండుకొని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్ లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికి తెలియజేశారు. అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబరు 24వ తేదీ అర్థరాత్రి యేసు క్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబరు 25వ తేదీ క్రిస్‌మస్ పండుగ.

ఆకట్టుకునే క్రిస్మస్ చెట్టు...
క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే క్రిస్‌మస్ పండుగ సందడి ప్రారంభమవుతుంది. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్ళను, చర్చీలను చక్కగా అలంకరిస్తారు. వెదురు బద్దలతో రంగు కాగితాలతో, ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తుగా పెడతారు. రాత్రి వేళ దీపాలంకరణతో ఇళ్ళు, చర్చీలు అందంగా ఉంటాయి.

ప్రతి ఇంట్లోను ఒక క్రిస్‌మస్‌ చెట్టును ఏర్పాటు చేస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. ఈ చెట్టును రంగు కాగితాలతోను, కాగితపు నక్షత్రాలతోను చిరుగంటలతోను చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. మరొక విశేషం ఉంది. క్రిస్‌మస్ క్రిందటి రాత్రి ' శాంతా క్లాజ్ ' ఆకాశం నుండి ధృవపు జింకలు లాగే తన బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందు కోసం పిల్లలు తమ మేజోళ్ళను వేలాడదీసి ఉంచుతారు. శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను పెట్టి వెళ్తాడు.
వీడియోను వీక్షించండి
 << 1 | 2   
మరిన్ని
ఆకట్టుకుంటున్న 'బెంగుళూరు కేకు ప్యాలెస్"
ఆనంద సందోహాల ఆదివారం - ఈస్టర్‌
ఆనంద సందోహాల ఆదివారం - ఈస్టర్‌