ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > క్రైస్తవ > గుడ్ ఫ్రైడే రోజున ఏమేం చేస్తారు...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గుడ్ ఫ్రైడే రోజున ఏమేం చేస్తారు...!
Gulzar Ghouse
Content consultent
గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ఇలా ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే "ఈస్ట్ వెడ్నెస్‌డే" నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు.

ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ఒక క్రిస్టియన్ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు.

ఆ తర్వాత మధ్యాహ్నంనుంచి మూడు గంటలవరకు సేవలుంటాయి. ఈ సేవలలో క్రీస్తు సిద్ధాంతాల(నాలుగు గోస్పెల్స్)లోంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు వినిపించి వారిచేతకూడా చదివిస్తారు.

ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనేదానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు.

దీని తర్వాత అర్థరాత్రికి సాధారణ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే సామూహిక ప్రార్థనలలో క్రీస్తు స్మృతిపథాన్ని గుర్తు చేసుకుంటారు.

కొన్ని చోట్ల నల్లటి వస్త్రాలు ధరించి భక్తులు క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేస్తారు. చివరికి కృత్రిమ అంతిమ సంస్కారం కూడా చేస్తారు.

క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు. ముఖ్యంగా ఈ రోజు చర్చిలలో గంటలు మ్రోగవు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏసు అమర వాక్యాలు
క్రైస్తవ సోదరులకు ప్రముఖుల శుభాకాంక్షలు
నేడు యేసుండు జన్మించే ఊరిలో....  
ప్రపంచంలోనే అతి చిన్న పవిత్ర బైబిల్
కరుణామయి మేరిమాత ఇలపై వెలసిన వేళ
హిందూ మతాన్ని స్వీకరించిన క్రైస్తవులు