కార్తీకమాసంలో నాగులచవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. నాగుల చవితినాడు ఉపవాసం ఉండి పుట్టదగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పంచమినాడు బంగారంతోగానీ, వెండితోగానీ, కర్రతోగానీ, మట్టితోగానీ 5 పడగల పాములను చేయించుకునిగానీ, లేకుంటే పసుపు చందనాలతో సర్పముల చిత్రాలను గీచి, భక్తితో పూజించి పాలు, పాయసము నువ్వుల పిండి, చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి.
నాగుల చవితినాడు భూమిని దున్నడం గానీ త్రవ్వటం కానీ చేయకూడదు. ఇలా సర్పారాధన చేయటం వల్ల నాగదోషాలు నశిస్తాయని నమ్మకం.
|