ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > పండుగలు > నాగుల చవితి... నాగారాధన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాగుల చవితి... నాగారాధన
Naga Puja
WD
కార్తీక మాసంలో వచ్చే ఈ నాగులచవితి రోజున నాగారాధన శ్రేష్ఠమైనది. ఈ రోజున బంగారం, వెండి, కర్ర, మట్టి లేక వారివారి తాహతును అనుసరించి ఐదుపడగల పామును చేయించాలి లేదంటే పసుపు, చందనముతో ఐదు లేదంటే ఏడు పడగల పాము చిత్రాలను గీచి వాటికి విధివిధానంగా సంపెంగ, గన్నేరు, జాజి తదితర పుష్పాలతో పూజించి పాలు, పాయసము నివేదన చేయాలి.

నాగారాధన చేయటం వల్ల స్త్రీలకు గర్భ దోషాలు, లైంగిక అసంతృప్తులు, చెవులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయని పురాణ వచనం. అంతేకాదు ఈ క్రింది శ్లోకాన్ని ప్రతి నిత్యం పఠించేవారికి సర్పభయం, విషభయాలు ఉండవని చెపుతారు.

శ్లోకం|| సర్పాసర్ప భద్రేం తే దూరం గచ్చ మహావిష
జనమేజయ యాగాంతే ఆస్తీక వచనం స్మర
అనంతాయ నమస్తుభ్యం నాగానాం పతయే నమః
అనంతో వాసుకిః శేషః పద్మనాభశ్చ కంబళః
శంఖపాలో ధార్తరాష్ట్ర: తక్షతః కాళీయ స్తధా
సంతేషాం నవనామాని
నాగానాంచ మహాత్మనామ్
సాయం కాలే పఠేనిత్యం
ప్రాతఃకాలే విశేషతః
విషాత్తస్య భయంనాస్తి
సర్వత్ర విజయీభవత్"
మరిన్ని
అందరి దైవం నీవన్నా...
నయనానందకరంగా గోవర్ధన్ మేళా
ఆన్‌లైన్‌లో లక్ష్మీ పూజ చేయండి... బాణసంచాను వెలిగించండి
చంద్రోదయ ఉమావ్రతం- అట్లతద్ది
ఓం శ్రీ దుర్గాదేవతాయైనమః
అయిమయి దీనదయాళుత యాకృపయైకతయా భవిత్యము మే