ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > పండుగలు > ఉత్తరాంధ్ర కొంగు బంగారం పైడితల్లి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉత్తరాంధ్ర కొంగు బంగారం పైడితల్లి
ఉత్తరాంధ్రలో జరుపుకునే జాతరలలో పైడితల్లి జాతరకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూసలపాటి రాజుల సోదరిగా చెప్పుకునే పైడితల్లి విజయనగర రాజవంశీయురాలని చెపుతారు. అప్పటి విజయనగర రాజు విజయరామరాజుకు పైడితల్లి సోదరి అని చెపుతారు. ఉదయాన్నే ఆమెను చూడకుండా విజయరామరాజు ఏ పని మొదలుపెట్టేవారు కాదట.

బొబ్బిలి యుద్ధ సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడి తల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు విజయరామరాజు. ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఎవరికో కలలో కనబడి తాను కనకదుర్గ అమ్మవారిలో ఐక్యమయ్యాననీ, తన విగ్రహం పెద్ద చెరువులో ఉందని చెప్పిందట.

ఆమె చెప్పినట్లుగానే చెరువులో విగ్రహం కనబడింది. ఈ సంఘటన 1757 సంవత్సరంలో జరిగింది. ఇక అప్పటినుంచి ఆ విగ్రహానికి పూజలు చేస్తూ వస్తున్నారు. విజయదశమి ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే సిరిమాను ఉత్సవానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

ఎందుకంటే ఆ మాను ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ఉత్సవాలలో భాగంగా విజయనగర రాజవంశీయులు కోటపై కూర్చుని అమ్మవారిని ఆహ్వానిస్తారు. రథోత్సవం నాడు పూసపాటి గజపతి వంశీయులు రథాన్ని లాగటంతో ఈ ఉత్సవం చివరి దశకు చేరుకుంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
సిరిసంపదలిచ్చే ఓనమ్ పండుగ  
ప్రేమానురాగాల 'బంధం'.. రక్షాబంధన్
అందరి దైవం నీవమ్మా... నాగమ్మా
శ్రీ ఆంజనేయ.. ప్రసన్నాంజనేయ...
సుందరకావ్యం.. రామాయణ చరితం  
"షడ్రుచుల" సమ్మేళనం ఉగాది పచ్చడి