హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » పండుగలు » పితృదేవతలకు తర్పణాలివ్వడం చాలా ముఖ్యం (Mahalaya Amavasya| Krishna| Karna| Dharma Raju)
 
WD
"ఆషాఢీ మవధిం కృత్యా పంచమంపక్ష మాశ్రితాః
కాంక్షంతి పితరః క్లిష్టాః అన్న మప్యసవహం జలమ్"- "ఆషాఢీ మవధిం కృత్యా పంచమంపక్ష మాశ్రితాః
కాంక్షంతి పితరః క్లిష్టాః అన్న మప్యసవహం జలమ్"
అనగా.. మన పితృదేవతలు ఆషాఢమాసము రెండు పక్షములు మొదలు తిరిగి కృష్ణపక్షము వరకు గల ఐదు పక్షములు మన పితృదేవతలు ఎన్నో ఇక్కట్లకు గురవుతారట. అందుకోసం సూర్యుడు కన్యా, తులారాశుల నుంచి వృశ్చికరాశికి వచ్చే వరకు ప్రేతపురి శూన్యముగా ఉండునని, అందువల్ల ఆ కాలమందు మన పితృదేవతలు అన్నోదకములు లేకుండా భూలోకమున వారివారి గృహముల చుట్టు ఆత్రంగా తిరుగుచుందురని మహాభారతము పేర్కొంటోంది. ఈ కారణంగానే మరణాంతరము నిర్వర్తించే కర్మలకు కీలక ప్రాధాన్యత ఉంది.

పూర్వం కురుక్షేత్ర యుద్ధంలో అంత్యకాలమందు కర్ణుడు కృష్ణ పరమాత్మను చివరిగా ఒక కోరిక కోరాడట. కృష్ణా నా జన్మవృత్తాంత రహస్యమును దయతో ధర్మరాజుకు సవిస్తరముగా వివరించి వానిచే తనకు పిండ ప్రదానములు గావించమన్నారట. కర్ణుని కోరికను పరమాత్మ అంగీకరించి ధర్మరాజుచే ఆ కార్యక్రమము చేయించినాడట. అలా ధర్మరాజు 77వేలమందికి పిండప్రదానాదులు గావించి వార్కి సద్గగతులు కల్పించినాడని పురాణాలు చెబుతున్నాయి.

కావున ఈ శ్రాద్ధకర్మలు నిర్వర్తించడం మానవుల విధి అని, పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేసి ప్రతిఫలం ఆశించరాదు. నూరు యజ్ఞాలు చేయడం కన్న, మన వంశ వృక్షానికి కారకులయిన పితృదేవతలు తర్పణాలివ్వడం ఎంతో ముఖ్యమని పురోహితులు అంటున్నారు. ఈ విషయమందు ఏమాత్రం అలక్ష్యభావన కూడదని వారు చెబుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.