ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > హిందూ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తెలుగు వాడు శ్రీ వల్లభాచార్య  Search similar articles
Pavan Kumar
శుద్ధ అద్వైత వేదాంతాన్ని బోధించిన శ్రీ వల్లభాచార్య మన తెలుగువాడు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ సమీపంలోని చంపారణ్యలో శ్రీ వల్లభాచార్య 1479లో జన్మించారు. శ్రీ వల్లభాచార్యులు కుటుంబం వైదీక బ్రాహ్మణులు. ఆయన ముత్తాత యజ్ఞ నారాయణ భట్ట. శ్రీ వల్లభాచార్య ముత్తాత యజ్ఞ నారాయణ భట్ట వేయి సోమ యజ్ఞాలు నిర్వహిస్తే మీ వంశంలో జన్మిస్తానని శ్రీకృష్ణుడు ఆయనకు మాట ఇచ్చాడు. ఆయన వంశంలో వారైన లక్ష్మణ భట్ట వారణాసి వెళ్లి ఈ శత సోమయజ్ఞాన్ని పూర్తిచేశారు. అనంతరం శ్రీ వల్లభాచార్యుల వారు జన్మించారు.

శ్రీ వల్లభా చార్యుల వారు ఏడేళ్ల వయస్సులోనే చతుర్వేదాలను కంఠోపాఠంగా నేర్చుకున్నారు. అలాగే ఆది శంకర, రామానుజ, మధ్వ, నింబారకులు వారి రచనలను వల్లభాచార్య చదివారు. వీటితోపాటే అప్పట్లో ఉన్న జైన, బౌద్ధ మతాలను గురించి తెలుసుకున్నారు శ్రీ వల్లభాచార్య. అంత చిన్న వయస్సులోనే ఇన్ని విషయాలు తెలుసుకున్న శ్రీ వల్లభాచార్యునిని అందరూ బాల సరస్వతి అని ముద్దుగా పిలిచేవారు.

విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న సమయంలో వైష్ణవులకు ఆదరణ ఎక్కువగా ఉందని తెలుసుకుని శ్రీ వల్లభాచార్యుల వారు అక్కడికి వెళ్లారు. అక్కడ జరిగిన సదస్సులో వైష్ణవులు-శక్తిని పూజించేవారు పాల్గొన్నారు.

శ్రీ వల్లభాచార్యుల నేతృత్వంలో వైష్ణవులు ఈ సదస్సులో విజయం సాధించారు. దీనితో శ్రీకృష్ణదేవరాయలు వల్లభాచార్యుల వారికి కనకాభిషేకం చేయించారు. శ్రీవల్లభాచార్యుల వారు దేశవ్యాప్త పర్యటన చేసి వైష్ణవ మత వైశిష్ట్యం గురించి ప్రచారం చేశారు. బ్రహ్మసూత్ర, భగవద్గీత, ఉపనిషత్తుల గురించి శ్రీవల్లభాచార్యులు తన వ్యాఖ్యలు రాశారు.
మరిన్ని
వైష్ణవ భక్తుడు చైతన్య మహాప్రభు
శ్రీరామ భక్తుడు గోస్వామి తులసీదాసు
నర్మదా, సోన్ నదుల జన్మస్థలం అమర్‌కంటక్
అద్వైత వేదాంత రూపకర్త ఆది శంకరాచార్య
శనివార ప్రియుడు శ్రీ హనుమంతుడు
బౌద్దమత ప్రధాన కేంద్రాలు