సిక్కు మత స్థాపకుడు గురునానక్ విరచిత గురు గ్రంథ్ సాహిబ్‌లో కొన్ని శబ్ధాలను అందించిన మహా భక్తుడు భగత్ సూరదాస్. భక్తి ఉద్యమంలో సూరదాస్ కీలకపాత్ర వహించారు. మెఘల్ చక్రవర్తుల్లో పరమత సహనం నిష్ఠగా పాటించిన అక్బర్ కాలానికి చెందినవారు సూరదాస్. సూరదాస్ 14వ శతాబ్దంలో జన్మించారు.
సూరదాస్ అంధత్వంతో పుట్టారు. ఆరేళ్ల వయస్సు నుంచే భక్తి మార్గాన్ని సూరదాసు అనుసరించారు. 18ఏళ్ల ప్రాయంలో ఆయన గురువు శ్రీ వల్లభాచార్యుల వారిని యమునా నది ఒడ్డున కలిశారు. ఆయన బోధించిన శుద్ధ అద్వైత విధానాన్ని సూరదాస్ ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన శ్రీమద్ భగవత్ గ్రంధాన్ని సమగ్రంగా సహచరుల సాయంతో విన్నారు.
సూరదాసు ఆ తర్వాత ద్వారాకాధీశుని పరమభక్తుడయ్యారు. సూరదాస్ బ్రహ్మచారి. సూరదాస్ ఎక్కువ కాలం నందనందనుడు శ్రీకృష్ణుడు జన్మస్థానమైన బృందావనంలో ఎక్కువ కాలం గడిపారు. ఈ సమయంలో ఆయన సూర్ సాగర్ (సంగీత సముద్రం) అనే గ్రంథాన్ని రచించారు. ఇందులో వేయి పద్యాలు ఉన్నాయి. సూర్ సాగర్‌లో ప్రస్తుతం 8వేల పద్యాల వరకే అందుబాటులో ఉన్నాయి. సూరదాస్ స్వతగానే బృందావనం ప్రాంతంలో మాట్లాడే వ్రజ భాషలో పండితుడు.
సూరదాసును సిక్కులు 14వ మతగురువుగా పిలుస్తారు. ఆయన రచించిన పాటలను సూరదాసు బాణిగా సిక్కులు నామకరణం చేశారు. ఆయన రచనలను తదుపరి కాలంలో సిక్కుల పవిత్ర మత గ్రంధమైన గురు గ్రంథ సాహెబ్‌లో జత చేశారు.
|