శ్రీరామ పరమభక్తుడు రామానంద. అందరినీ వైష్ణవ మతంలోకి తీసుకుని శిష్యులుగా మార్చిన ఘనత రామానందుల వారిది. భక్తి ఉద్యమంలో ఉత్తరాది నుంచి కీలకపాత్ర పోషించిన వారిలో రామానందులు వారు ఒకరు. దక్షిణాది చెందిన కుటుంబంలో రామానందులు వారు 14వ శతాబ్దంలో అలహాబాద్‌లో జన్మించారు.
రామానందుల వారు చిన్న వయస్సు నుంచే తాళపత్రా గ్రంధాలను కంఠోపాఠంగా చదివారు. శ్రీ వైష్ణవ మతంలో ముఖ్య గురువైన రాఘవానందుల వారి శిష్యుల్లో ఒకరు రామానందులు. రామానందులు వారు దక్షిణాది పర్యటనకు ఒకసారి వెళ్లివచ్చిన తర్వాత సన్యాసం పుచ్చుకుంటానని ఇంట్లో అనగా ఆయన సోదరుడు దానిని వ్యతిరేకించాడు.
రామానందుల వారి ఉద్దేశ్యంలో అఖిలాండ కోటికి రక్షకుడు సాకేత రాముడు ఒక్కడేని అని భావించారు. నాటినుంచి శ్రీరామ భక్తుడయ్యారు రామానందుల వారు. దేశంలో పలుప్రాంతాలు సందర్శించి రామానందుల వారు అనేక ప్రవచనాలు చేశారు. సిక్కుల పవిత్ర గ్రంధమైన గురు గ్రంధ్ సాహెబ్‌లో ఆయన రచించిన ఒక పద్యానికి వారు అందులో పదిలపరిచారు. సమాజంలోని అనేక దురాచారాలకు రామానందుల వారు ఎండగట్టారు.
రామానందుల వారి ప్రముఖ శిష్యుల్లో కబీరు ఒకరు. ఇతర శిష్యుల్లో అనంతానంద, భావానంద, ధాన్న భగత్, నాభ, పిప, రవిదాసు, సుఖానంద, తులసీదాసుల వారు ఉన్నారు. ఉత్తరాది మొత్తం ముస్లింల పరిపాలన సాగుతున్న సమయమది. హిందువులను కులాలు, వర్గాలు వారీగా విభజించి పాలించారు ముస్లిం పాలకులు. వారి చర్యలను రామానందుల వారు సున్నితంగా వ్యతిరేకించారు.
|