మహారాష్ట్ర పంఢరిపురం విఠలుని మహాభక్తుడు నామ్‌దేవ్. సిక్కుల తమ భగతుల్లో ఒకరిగా నామ్‌దేవ్‌ను పరిగణిస్తారు. మరాఠా రచయితల్లో ఒకరు నామ్‌దేవ్. మరాఠీ భాషతో పాటుగా హిందీ, పంజాబీ భాషల్లో అనేక రచనలు నామ్‌దేవ్ చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా నారస్‌వర్మాణి గ్రామంలో నామ్‌దేవ్ 12వ శతాబ్దంలో జన్మించారు. నామ్‌దేవ్ జన్మించిన తర్వాత ఆయన తల్లిదండ్రులు పంఢరిపురంకు మకాం మార్చారు. నామ్‌దేవ్ తల్లిదండ్రులు విఠలుని పరమభక్తులు.
నామ్‌దేవ్ చిన్నతనం నుంచే విఠలుని భక్తుడు. భక్త ప్రహ్లాదుని వలే విఠలుని కొలిచాడు నామ్‌దేవ్. విఠలునిపై ఆర్తితో నామ్‌దేవ్ అనేక కృతులను విరచించి పాడారు. వీటిని నామ్‌దేవ్ గాథాలో పొందుపరచారు. నామ్‌దేవ్ ఏడేళ్ల ప్రాయంలోనే వివాహం జరిగింది. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆ తదనంతర కాలంలో ఆధ్యాత్మికం వైపు మళ్లిన నామ్‌దేవ్ దేశవ్యాప్తంగా సంచరించారు.
ఆధ్యాత్మిక గురువు సంత్ ధ్యానేశ్వర్ శిష్యుడు నామ్‌దేవ్. ఆయన జీవిత కాలంలో చివరి కాలాన్ని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో గడిపారు. అక్కడే ఆయన స్మారక మందిరాన్ని నిర్మించటం జరిగింది. దీని నిర్మాణంలో సర్దార్ జస్సా సింగ్ రాంగర్హీయా ఆర్ధిక సాయం అందించారు. దీనికి అభివృద్ధికి సిక్కు రాజుల్లో గొప్పవాడైన మహారాణా రంజిత్ సింగ్ మేనత్త రాణి సదా కౌర్ పాటుపడ్డారు.
నామ్‌దేవ్ శిష్యుడే భక్త తుకారం. నామ్‌దేవ్ రచనల్లో నామ్‌ద్వ్ గాథా, తీర్ధావళి వంటివి ఉన్నాయి. భక్తి ఉద్యమ కాలంలో తన వంతు పాత్ర పోషించాడు నామ్‌దేవ్. సిక్కుల ఐదవ మత గురువు అర్జున్ దేవ్ విరచించిన గురుగ్రంథ్ సాహెబ్‌కు తన చేతనైన సేవ చేశారు నామ్‌దేవ్. నామ్‌దేవ్ పంజాబ్‌లో గురుదాస్‌పూర్ జిల్లా పర్యటనలో భాగంగా గూమాన్ నివసించారు. ఆ తదుపరి కాలంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడే ఆయన సమాధి ఉంది. గురుద్వారా గూమన్ ఇక్కడ ఏర్పాటుచేశారు.
|