ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...
1. తత్ - గణేశ్వరుడు 2. స - నృసింహ భగవానుడు 3. వి - విష్ణుదేవుడు 4. తుః - శివదేవుడు 5. వ - కృష్ణ భగవానుడు 6. దే - రాథా దేవి 7. ణ్యం - లక్ష్మీదేవి 8. భ - అగ్నిదేవుడు 9. ర్గః - ఇంద్రదేవుడు 10. దే - సరస్వతి 11. వ - దుర్గాదేవి 12. స్య - హనుమంతుడు 13. ధీ - పృధ్వీదేవి 14. మ - సూర్యదేవుడు 15. హి - శ్రీరాముడు 16. ధి - సీతామాత 17. యో - చంద్రదేవుడు 18. యో - యమదేవుడు 19. నః - బ్రహ్మదేవుడు 20. ప్ర - వరుణదేవుడు 21. చో - నారాయణుడు 22. ద - హయగ్రీవ భగవానుడు 23. యా - హంసదేవత 24. త్ - తులసీదేవి
మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.
|