|
కార్తీకమాసం చివరి వారం కావడంతో భక్తులతో దేవాలయాలన్నీ నిండిపోయాయి. అదేవిధంగా వనభోజనాలు సైతం జోరుగా చోటుచేసుకున్నాయి. వనభోజనాల విశిష్టతను గురించి తెలుసుకుందాం...
కార్తీక మాసంలో సోదరి చేతివంట అంటే... భగినీ హస్త భోజనము చేసి యధాశక్తి వారికి కానుకలు సమర్పించటంతోపాటు, సమీప ఉసిరి చెట్టుగల వనములో బంధువులు, స్నేహితులతోకూడి ఉసిరిచెట్టును పూజించాలి. ఆ తర్వాత మనసుకు ఉల్లాసం కలిగించే ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ, సాత్విక ఆహారంతో వనభోజనం చేయాలి.
ఇలా చేయడం వల్ల మన జీవనగమనంలో మంచి ఆహ్లాదంతోపాటు అన్నదాన ఫలితము కూడా లభిస్తుందని విశ్వాసం. అందువల్లనే పూర్వకాలం నుంచి కార్తీకమాసంలో వనభోజనాలను ఆచరిస్తుంటారు. వనభోజనాలకు సంబంధించిన వీడియోను చూడండి.
|