"తుంగభద్ర తరంగిణిమ్ మద్విక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణ: "
పవిత్రమైన తుంగభద్ర తరంగిణీలను చూసినంత మాత్రమే కోటి జన్మాల్లో చేసిన పాపాలన్నియు నశిస్తాయి. ఇలాంటి పవిత్ర పుణ్య తీర్థం అయిన తుంగభద్ర నది పడమటి కనుమల్లో వరాహ పర్వం మీద గంగా మూల "తుంగ", "భద్ర" అనేడి రెండు నదులు దగ్గర దగ్గరగా జన్మించి సిమోగాకి సుమారు తొమ్మిది మైళ్ళ దూరంలోఉన్న కుడ్లి అనేచోట ఒకటిగా కలిసి తుంగభద్ర అనే పేరుతో ప్రవహిస్తూ... కృష్ణా నదిలో కలుస్తోంది. అత్యంత పురాణ ప్రసిద్ధమైన నదుల్లో తుంగభద్ర నది ఒకటి.
దేవగురువు బృహస్పతి మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఈ నదీమతల్లికి పుష్కరాలు జరుగుతాయి. |