పాదాభివందనం చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సు, జ్ఞానం, పెద్దరికం, దైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి నిస్వార్థపూరిత ప్రేమ, మనకోసం చేసే త్యాగాలకు గుర్తుగా ఈ పాదాభివందనాన్ని చేస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు బిడ్డలు చేసే పాదాభివందనాన్ని ఈ సందర్భంలో పేర్కొనాలి. ఇలా పాదాభివందనాలను ప్రతి రోజూ, లేదా ముఖ్యమైన సందర్భాలలో చేయడం మన సంప్రదాయం. ఇలా భక్తితో తలవంచి వారి పాదాలకు నమస్కరించినప్పుడు అనుకూల శక్తి రూపంలో వారి నుంచి మంచి కోరికలు, ఆశీర్వాదాలు అందుకుంటున్నట్లు భావించాలి. కుటుంబంలో, సమాజంలో ప్రజలమధ్య సామరస్యాన్ని, పరస్పర ప్రేమ, గౌరవాలతో కూడిన వాతావరణాన్ని ఈ సంప్రదాయం సృష్టించగలదని గుర్తించాలి, హ్యాండ్ షేక్‌తో అంటురోగాలు " నమస్తే" అని ఒకరికొకరు పలుకరించుకోవడమంటే మన మనస్సులు కలువవచ్చు అని సూచించుకోవడమన్న అర్థం. తల వంచి నమస్తే.. అంటే స్నేహాన్ని ప్రేమానురాగాల రూపంలో వినమ్రంగా అందించడం. నమస్తే అనే మాటకు ఆధ్యాత్మిక అర్థం జీవన శక్తి, దైవత్వం, భగవంతుడు సకల చరాచరాలలో ఒకే విధం అని చెప్పుకోవడం. పాశ్చాత్యుల ప్రభావం వల్ల మన దేశంలోకి వచ్చిన హ్యాండ్ షేక్‌లు మంచివి కావు. వీటి ఫలితంగా అంటువ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. పాశ్చాత్య దేశాల్లో గ్లౌజ్‌లు ధరించి మరీ చేతులు కలుపుతున్నారంటే హ్యాండ్ షేక్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇతరులకు హ్యాండ్ షేక్ అంటూ మన చేతులను ఇవ్వడం వల్ల మనలో ప్రోది చేసుకున్న దైవత్వ బలాన్ని ఇచ్చి వేసినట్లేనని భారతీయుల విశ్వాసం. కనుక హ్యాండ్ షేక్‌లకు ఇకనైనా స్వస్తి పలకమంటున్నారు ఆధ్యాత్మిక గురువులు. |