ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > హిందూ > ఎవరో చెపుతూపోతే మీ తెలివి తేటలు ఎందుకు?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎవరో చెపుతూపోతే మీ తెలివి తేటలు ఎందుకు?
WD
ధ్యానం చేయడానికి ఏకాగ్రత కావాలి. అందుకోసం కళ్లు మూసుకోవాలి. అలాగని ఏకాగ్రత కోసం మోటార్ బైకు తోలుతూ కళ్లు మూసుకుంటే... ఏమవుతుంది? కనుక ఒకదానికి చెప్పింది మరోదానికి సూటవదు. ఎలా నిలబడాలి, ఎలా నడవాలి, ఎలా పరుగెట్టాలి, ఎలా నవ్వాలి, ఎలా ప్రవర్తించాలి అని ఎవరో చెపుతూ పోతే ఇక మీ తెలివి తేటలు ఎందుకు?

మరొక విషయం ఏమిటంటే... ఎవరితోనో పోల్చుకుని మీరు తక్కువై పోతున్నారని బాధపడకండి. అందుకోసం మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకండి. వీటన్నిటికీ సరైన మందే ధ్యానం. కొందరు ధ్యానం చేయాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని అంటుంటారు. అసలు మెదడును నియంత్రించాలని ఎందుకు అనుకోవడం..?

మెదడు కూడా శరీరంలో ఒక అంగమే. గుండె, ఊపిరితిత్తులు కూడా అంగాలే. ఆ అంగాలు పనిచేయకూడదని మనం ఎన్నడూ అనుకోం కదా. అటువంటిది మెదడు ఆలోచనలను ఆపాలని ఎందుకు అనుకోవడం. ప్రపంచంలోని కష్టాలన్నీ ఎక్కడ పుడుతున్నాయి? అని ఆలోచిస్తే, మానవ మెదడులోనే అని స్పష్టమవుతుంది.

ఈ మెదడును ఎలా నడపాలో తెలియనివారివల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. మెదడు ఆలోచనలను ఆపడం ఎవరి తరం కాదు. అయితే అది సక్రమ ఆలోచనలు చేసేలా చూడాలి. ఇందుకోసం యోగాలో ఓ పద్ధతి ఉంది.

ప్రశాంతంగా ఒకచోట కూర్చుని మెదడుమీద నియంత్రణకోసం చెప్పే చిన్న సూచనలను అనుసరించండి. అలా చేస్తే మీ శరీరం, మనసు వేరువేరుగా కనిపిస్తాయి. ఆ రెండింటి మధ్య దూరం సృష్టించగలిగితే మీ కష్టాలన్నింటిని తొలగించుకుని పూర్తి సామర్థ్యం ప్రదర్శించగలుగుతారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మిని పూజించండి
ఏకాదశి వ్రతం చేయు విధానంబెట్టిదనిన...!
శ్రీ రామనవమి రోజున రాముని సందేశం పాటించండి
వందనం... పాదాభివందనం
కుటుంబ సంక్షేమం... స్త్రీ నుదుటి సిందూరం
స్త్రీలు జుట్టు విరబోసుకోరాదంటారు ఎందుకు?