ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > హిందూ > సంస్కృతిలో తండ్రి గొప్పతనం !
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సంస్కృతిలో తండ్రి గొప్పతనం !
పురాణాలలో తండ్రినిలా వర్ణించారు.
న తో ధర్మచరణం కించిదస్తి మహత్తరమI
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రిపII
-వాల్మీకి (రామాయణం, అయోధ్యకాండ)

తండ్రికి సేవలు చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడంకన్నా మించిన మరో ధర్మాచరణ లేదని ఈ శ్లోకం అర్థం

జ్యేష్ఠో భ్రాతా పితా వాపి యశ్చ విద్యాం ప్రయచ్ఛతి I
త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మే చ పథి వర్తిన: II
-వాల్మీకి (రామాయణం, కిష్కింధకాండ)

పెద్దన్నయ్య, తండ్రి మరియు విద్యను ప్రసాదించే గురువు- వీరు ముగ్గురుకూడా ధర్మ మార్గాన్ననుసరించే తండ్రిలాంటి వారు. వీరినికూడా తండ్రితో సమానంగా గౌరవించాలంటోంది మన హిందూ ధర్మం.

దారుణే చ పితా పుత్రే నైవ దారుణతాం వ్రజేతI
పుత్రార్థే పద:కష్టా: పితర: ప్రాప్నువన్తి హి II
-హరివంశ్ పురాణం(విష్ణు పర్వం)

పుత్రుడు క్రూర స్వభావం కలవాడైనాకూడా తండ్రి అతనిపట్ల ప్రేమగానే చూస్తుంటాడు. ఎందుకంటే తన పుత్రుడికొరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొనేది తండ్రేనని పురాణాలు చెపుతున్నాయి.

జనితా చోపనేతా చ, యస్తు విద్యాం ప్రయచ్ఛతి I
అన్నదాతా భయత్రాతా, పంచైతే పితర: స్మృతా: II
-చాణక్య నీతి
ఈ ఐదుగురుకూడా తండ్రితో సమానమని చాణక్య నీతి చెపుతోంది. (జన్మనిచ్చేవాడు, ఉపనయనం చేసేవాడు, చదువు చెప్పేవాడు, అన్నదాత, భయాన్ని పోగొట్టేవాడు)
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎవరో చెపుతూపోతే మీ తెలివి తేటలు ఎందుకు?
అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మిని పూజించండి
ఏకాదశి వ్రతం చేయు విధానంబెట్టిదనిన...!
శ్రీ రామనవమి రోజున రాముని సందేశం పాటించండి
వందనం... పాదాభివందనం
కుటుంబ సంక్షేమం... స్త్రీ నుదుటి సిందూరం