ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > హిందూ > శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలి?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలి?
శ్రావణ సోమవార వ్రతంలో ఆదిదంపతులైన శివపార్వతులను పూజిస్తారు. పురాణాలననుసరించి సోమవారపు వ్రతాలు మూడు రకాలుగానున్నాయి. సోమవారం, పదహారు సోమవారాలు, సౌమ్య ప్రదోష్. అన్ని వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి. శ్రావణమాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి.

శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రంవరకు పాటిస్తుంటారు. శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది.

శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించే వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రనుపక్రమించి స్నానపానాదులు పూర్తి చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని గంగాజలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి. ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజగదిలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయండి లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోండి.

పూజాదికార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రం పఠిస్తూ సంకల్పం చేసుకోండి.

'మమ క్షేమస్థైర్యవిజయారోగ్యైశ్వర్యాభివృద్ధయర్థం సోమవ్రతం కరిష్యే '

ఆ తర్వాత క్రింది మంత్రాన్ని ధ్యానించండి...
" ధ్యాయేన్నిత్యంమహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్జవలాంగ పరశుమృగవరాభీతిహస్తం ప్రశన్నం I

పద్మాసీనం సమంతాత్స్తుతమమరగణైర్వ్యాఘ్రకృతిం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ II "

ధ్యానం తర్వాత "ఓం నమఃశివాయ" తో శివునికి మరియు "ఓం నమఃశివాయై" తో పార్వతీదేవిని షోఢశోపచారాలతో పూజించండి. పూజ పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించి కథను వినండి. ఆ తర్వాత భోజనం లేదా ఫలహారం సేవించండి.

శ్రావణ సోమవారపు వ్రతాన్ని నియమానుసారం పాటిస్తే ఆదిదంపతులైన శివపార్వతుల కృపాకటాక్షాలు లభిస్తాయి. జీవితం ధన్యమవుతుంది. ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంటాయి. భక్తుల కష్టాలు హరింపబడుతాయని పురాణాలు చెపుతున్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దరిద్రాన్ని దహించే శివస్తోత్రమ్
'ఓం నమః శివాయ'ను స్మరించండి!
సంస్కృతిలో తండ్రి గొప్పతనం !
ఎవరో చెపుతూపోతే మీ తెలివి తేటలు ఎందుకు?
అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మిని పూజించండి
ఏకాదశి వ్రతం చేయు విధానంబెట్టిదనిన...!