బుధవారం ఉదయం ఏర్పడనున్న సూర్యగ్రహణం ప్రభావం భారత్‌పై ఏ మాత్రం ప్రభావం చూపనుందనేది పలువురు జ్యోతిష్యులు పరిపరి విధాలుగా చెపుతున్నారు. అదే శాస్త్రజ్ఞులు వారి వాదనలు వినిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో శాస్త్రాలు, జ్యోతిష్యంపై అధికుల నమ్మకం ఉండటంతో జోతిష్యం ఏం చెపుతోందనే దానిపైనే ఆసక్తి ఎక్కువగా ఉంది. సూర్యగ్రహణం బుధవారం ఉదయం కర్కాటక లగ్నం, కర్కాటక రాశి ద్వారా గ్రహణం ప్రారంభం కానుంది. దీంతో దేశంలోని పరిస్థితిలో మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రస్తుతం సూర్యుడు ధనస్సురాశినుంచి చంద్రగ్రహంలోని కర్కాటక రాశిలోనున్నాడు. దీంతో దేశపరిస్థితుల్లో, విదేశీ వ్యవహారాలలో అశుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యులు అంటున్నారు. ఈ సూర్యగ్రహణం కారణంగా విదేశాలనుంచి తీవ్రవాదుల ముప్పు పొంచి ఉంటుంది. దీంతో ప్రజల ప్రాణాలకు, ప్రజల ధనానికి ముప్పు అధికంగా ఉంటుంది. అలాగే దేశంలోని పరిస్థితికూడా సరిగా ఉండదు. ధరలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొననుంది. పేదప్రజలు తీవ్ర అవస్థలకు గురౌతారు. ప్రజల బాగోగులపై అటు కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రభుత్వాలుకాని ఏమంతగా దృష్టిని సారించవు. అరాచకాలు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ద్వితీయ భావంలో శత్రురాశి అయిన శని సప్తమం, అష్టమంలో ఉండటంమూలాన ధన నష్టం సంభవించవచ్చు. దీని ప్రభావం షేర్ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఈ స్థితి దేశీయ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం కనపడనుంది. ఇటు సప్తమ భావంలో శని ఉండటంతో అకస్మాత్తుగా యుద్దం తలెత్తే సూచనలు కనపడుతున్నాయి. దేశీయ-అంతర్జాతీయ సంబంధాలలో పరిస్థితి అనుకూలంగా ఉండదు. అష్టమభావంలో కుంభరాశిలోనున్న గురువుకూడా సరిగాలేదు. దీంతో విదేశీ వ్యాపారాలు, సంధి, దౌత్యకార్యాలలోకూడా అననుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏమంతగా లాభకారిగా ఉండవు. ఏకాదశభావంలో కుజునితో కలిసి శుక్రుడు తన సొంత ఇంటిలో ఉండటం కారణంగా ఫలితాలు మిశ్రమ ఫలితాలనిస్తాయి. దీంతో ప్రజల ఆదాయంలో పెద్దగా మార్పులుండవు. షేర్ మార్కెట్ పరిస్థితుల్లో ఫలితాలు మాత్రం ఆశించినంతగా ఉండవు. బుధవారం ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా ప్రజలు అత్యధికమైన కష్టాలను ఎదుర్కోక తప్పదు. దేశంలో అరాచకాలు పెచ్చుమీరిపోనున్నాయి. ఏ రాజకీయపార్టీలుకూడా వీటిపై పెద్దగా దృష్టిని సారించే పరిస్థితులు కనపడటం లేదు. ధరలను అదుపుచేసే పరిస్థితులు కనపడటం లేదు. |