వరంగల్ జిల్లాలో బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని పద్మాక్షమ్మ దేవాలయం నీటి గుండంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని భారీ బందోబస్తు మధ్య నగర మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ప్రారంభించారు.
బతుకమ్మ విగ్రహానికి తలపై ఉన్న పూలకు కాంగ్రెస్ పార్టీ మూడు రంగులు అద్దిందని పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో విగ్రహం వద్ద రెండు రోజుల నుంచి భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. చికాగో నగరంలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసాంధ్రులు సంప్రదాయ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానికంగా లభించే పువ్వులతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది పాల్గొన్నారు.