హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » హిందూ » మీ పిల్లలు సరిగా చదవడం లేదా...! (Mantras | Studies | Saraswathi | Lord Vishnu | Purushothamudu | Student)
Feedback Print Bookmark and Share
 
ప్రపంచంలోని ప్రతి ప్రాణికి ఏదో ఒక ఇబ్బంది ఉండనే ఉంటుంది. ప్రతి ప్రాణి ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. కాబట్టి ఇబ్బందులను దూరం చేసేందుకు చిన్నపాటి ఉపాయాలను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్యులు చెపుతున్నారు. క్రింద పేర్కొనబడిన మంత్రాలను జపిస్తే మీకున్న కష్టాలను దూరం చేసుకోవచ్చు.

మందబుద్ధి విద్యార్థులకు ఉపయోగపడే మంత్రం:

మంత్రం: ఓం హ్యీం శ్రీం ఐ వద్వద వాగ్వాదినీ I
సరస్వతీ తుష్టి పుష్టి తుభ్యం నమః II

మందబుద్ధి విద్యార్థులు మంచి రోజు చూసుకుని ఉదయాత్పూర్వం స్నానపానాదులుకావించి, పవిత్రమైన ఆసనంపై కూర్చొని, ధూపదీపాలను వెలిగించి భక్తి పూర్వకంగా 21సార్లు జపించాలి. ఇలా ఒక నెలపాటు నియమానుసారం జపిస్తే సరస్వతీ దేవీ ప్రసన్నమై విద్యను ప్రసాదిస్తుంది.

మందబుద్ధి విద్యార్థుల కొరకు మరో ఉపాయ

1** విద్యామభ్యస్త్యతా నిత్యం జప్తవ్యః పురుషోత్తమ I

2** ఓం విష్ణవే నమః

పైన పేర్కొనబడిన తొలి మంత్రాన్ని ప్రతి రోజు ఆ పురుషోత్తముడిని స్మరిస్తూ పై మంత్రాన్ని 108సార్లు జపించండి. అలాగే విష్ణు భగవానుని స్మరిస్తూ రెండవ మంత్రాన్ని 108సార్లు జపిస్తే విద్యప్రాప్తిస్తుంది. విద్యార్థులందరూ ఈ మంత్రాన్ని పఠించి మంచి ఫలితాలను పొందగలరు.

గమనిక : పైన పేర్కొనబడిన మంత్రాలు ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకోబడినది. పాఠకులు వీటిని విశ్వాసంతో పఠించి మంచి ఫలితాలను పొందండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.