కార్తీకమాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశినాడు ధన్‌తేరస్ పండుగను ఉత్తరభారతీయులు జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీయోగం ఉంటుంది. ఇది ధనలక్ష్మితోపాటు సుఖ-సంతోషాలు సమృద్ధిగా లభిస్తాయి. ధన్‌తేరస్ రోజున కొత్త పాత్రలు, నగలతోపాటు ఇతర వస్తు సామగ్రిని కొనుగోలు చేయండి. దీంతో శుభఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు.
ధన్‌తేరస్ రోజున బంగారు, వెండి ఆభరణాలతోపాటు పాత్రలు, భూమి, భవనం మొదలైన వస్తువులు కొంటే శుభకరమంటున్నారు జ్యోతిష్యులు. ఈ సమయంలో కొన్న వస్తువులతో సంవత్సరం మొత్తం లాభకారిగా ఉంటుంది. సాయంత్రం యమపూజతోపాటు దీపదానం చేయాలి. ఈ రోజు సమృద్ధి దేవత అయిన లక్ష్మీదేవి, ధనాధిపతి కుబేరుడు మరియు వైదిక నారాయణుడు ఇంద్రుడిని పూజించి అర్చించాలి.
ధనాధిపతి కుబేరుడును ఇలా సంతోషపరచండి :
** స్నానపానాదులుగావించి మీ పూజగదిలో తూర్పువైపున కూర్చోండి.
** చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి.
** కుబేరుని యంత్రం మరియు ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచండి.
** ధాన్యం మరియు బెల్లం అర్పించండి.
** బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి పవిత్ర నీటితో స్నానం చేయండి.
** కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ, సింధూరం, అక్షతలతో పూజించండి.
** ఐదుసార్లు ఓం గం గణపతయే నమః అని జపించండి.
** ఓం శ్రీ కుబేరాయ నమః , ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను తులసిమాలతో 108సార్లు జపించంతడి. ఇంట్లో స్వస్తిక్ గుర్తునుంచండి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చంటున్నారు జ్యోతిష్యులు.