హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | సంక్రాంతి | మహాశివరాత్రి | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » హిందూ » మానవ పతనమే కలి వ్యూహం: మేల్కొనండి (Kali, Bavishya Puranam, Bhagavatam,)
Bookmark and Share Feedback Print
 
భవిష్య పురాణం, భాగవతాది గ్రంథాలలో మన మహర్షులు కలి వ్యూహాలను అతను ఎక్కడ ఎప్పుడు ఎలా భగవద్వేషాన్ని పెంచుతాడో, శివకేశవులు లేరు, యజ్ఞయగాదులు వృధా, ఇంద్రియ సుఖాలు పొందటం కంటే మానవునికి ఉన్న అత్యున్నత లక్ష్యమింకేముందని ? వితండవాదాలను ఎలా ప్రసారం చేయగలడో దానికి తోడ్పడగల వివిధ సిద్దాంతాలు ఎలా విస్తరిల్లుతాయో, వివరంగా వివరించి హెచ్చరించారు.

సరే ఇక్కడ ఆయన పోరాట వ్యూహాన్ని చూద్దాం. కొందరు తినటం సుఖించటం అనే ఎండమావులవెంట పరిగెత్తేలా చేసి ధర్మం వైపు తలెత్తి చూడనివ్వడు కలి. ఇక్కడ ధర్మాన్ని అనుసరించే వారిలో కామ క్రోధాదులు రెచ్చగొట్టి ,మనసును విషయవాంఛలమీదకు తిరిగేలా చేస్తాడు. ఈ తాకిడికి తట్టుకోలేని వారు మొగ్గదశలోనే తమ సాధనలు వదలి జారిపోతారు.

ఇంకా కొద్దిమంది సాధకులు పైకెదగగానే వారి చుట్టూ స్వార్ధపరమైన ఆలోచనాపరుల గుంపులను చేర్చి, వారి భావాలతో కలుషితమైన మనస్సుతో ఆసాధకుడు క్రమంగా కామినీ, కనకాలపట్లనో కీర్తి కాంక్షలపట్లనో అనురక్తుడయి తల్లకిందులుగా పల్టీలు కొట్టుకుంటూ పాతాళానికి జారేలా చేస్తాడు.

నేలపైనడుస్తూ పడ్డవాణ్ణి గూర్చి అందరికీ పెద్దగా తెలియదుగాని కొండమీదనుంచి దొర్లినవాణ్ని గూర్చి మాత్రం పెద్దచర్చ జరుగుతుంది. వాడి ఖర్మగాలి వాడుపడ్డాడని అనరు. వాడికెంత బలుపో అంటారు. ఇక వాడు పదిమందిని నడిపే వాహనచోదకుడైతే నమ్ముకున్నవాళ్లంతా నట్టేటమునుగుతారు.

కాబట్టే యత్యాశ్రమము వంటి అత్యున్నత వ్యవస్థలో కఠినమైన నిబంధనలు విధించారు పెద్దలు. అతడు వస్తు సంచయనం చేయరాదు. అరచేయి పళ్ళెంగా ఎక్కడ దొరికినది అక్కడ ఎప్పుడు లభించినది అప్పుడు మాత్రమే స్వీకరించాలని. స్త్రీలను తమ సాన్నిధ్యంలో ఉండనీయరాదు. ఎక్కడా మూడుపూటలకంటే [చాంద్రాయణ వ్రతంలో తప్ప] నిదురించరాదనే నియమాలు ఏర్పరచారు.

ఎప్పుడైతే యత్యాశ్రమాన్ని ఆశ్రయించినవారు పెద్దలమాటలను పక్కన బెట్టడమో లేక తమ మానసిక శక్తిపైన అతినమ్మకంతోనో తాము చేయబోయే సత్కార్యములకొరకని డబ్బు సేకరించిపోగేయటం ,తమ నివాసలని శాస్వతంగా ఉండేలా చేయడం, భగవత్ కార్యక్రమాలకు పాల్గొనవచ్చో స్త్రీలను ఆశ్రమాలలో బసచేయనీయడం, వారితో ఎక్కువగా సంభాషించడం వంటివి చేస్తారో అప్పుడు "కలి" తన ప్రభావాన్ని చూపుతాడు.

బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లా సంచయనం చేసిన ధనం కోసం, వదిలివేసిన బంధువర్గాలో... అభిమానులో చేరికూర్చుంటారు. ఇక వీరిద్వారా మిగతావారు చేరుతారు. వెరసి ఏ సంసారాన్నైతే వదలుకుందామని సన్యాసాన్ని స్వీకరించారో ఇంకో రూపంలో అది చుట్టూ చేరుతుంది. ఇక భగవంతుని తాము దర్శించేందుకు వెచ్చించాల్సిన సమయము మిగతా వాటిపై ఖర్చుచేసి తమ సాధనాశక్తి వృధాఅయి స్వయంకృతాపరాధంగా పతనమవుతుంటారు.

- దుర్గేశ్వర వచనాలు
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కలి, భవిష్య పురాణం, భాగవతం