హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | సంక్రాంతి | మహాశివరాత్రి | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » హిందూ » పనిదొరికేంత వరకూ పాకులాడుతారు.. దొరికిన తర్వాతా..?!! (Spirutual talks | Work | Depression)
Bookmark and Share Feedback Print
 
WD
కొంతమంది పనిలేనప్పుడు, పని దొరకడం లేదని బాధపడతారు. తీరా దొరికిన తర్వాత సోమరులవుతారు. చివరికి తమ పీఠానికే ఎసరు తెచ్చుకుంటారు. పని లేనప్పుడు దానికున్న విలువ ఎంతటితో తెలుసుకున్న వారు దొరికిన తర్వాత దర్జాలు పోతుంటారు. ఇక మరికొందరు పని దొరికిందని సంతోషపడటాన్ని మానేసి గాభరా పడుతూ రక్తపోటు తెచ్చుకుంటారు.

మంచి పదవి దక్కే దాకా దానికోసమే పోరాడుతారు. ఆ పదవి దక్కిన తర్వాత ప్రతి నిమిషం టెన్షన్ అంటారు. ఇంకా పెద్ద పదవి వస్తే ఏం చేస్తారు...? "ఇంతకు ముందు ఎంతో ఆనందంగా ఉండేవాణ్ణి.. ఇప్పుడు ప్రశాంతత కోల్పోయింద"ని బాధను వ్యక్తం చేస్తుంటారు. నిజానికి పని లేనప్పుడు వారనుభవించిన నరకయాతన అస్సలు గుర్తు రాకపోవడం మూలానే ఈ మాటలు వస్తాయి.

ఓటమివల్ల వచ్చే బాధకైనా అర్థం చెప్పవచ్చు.. కానీ గెలుపు సాధించిన తర్వాత కూడా బాధపడుతుంటే మీలో అసలుకే ఏదో గొడవ ఉందని అర్థం. అసలు మీ వల్లకాని పని మీకు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు...? మీరు చిట్టచివరి బంట్రోతు అయినా... మిమ్మల్ని మీరు సరిచూసుకునే శక్తిలేకపోతే, మీరు పైస్థాయికి రావాలని ప్రయత్నిస్తే, అది ఒక ఆపదగానే పరిణమిస్తుంది.

చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల బెదరకుండా మీలోని మనస్సును ముందు సక్రమంగా ఉండేలా చూసుకోండి. మీలో దాగున్న సోమరిని బయటకు తరమండి. మానసిక ఒత్తిడి లేకుండా, మిమ్మల్ని ఆనందంగా నిర్వాహక శక్తిని ఉపయోగించి నియంత్రించడం నేర్చుకుంటే, నమ్మలేని వాటిని సాధించి చూపవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మిక వచనాలు, పని, ఒత్తిడి