హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | సంక్రాంతి | మహాశివరాత్రి | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి | శ్రీఖర నామ సంవత్సర ఉగాది
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » హిందూ » ఎక్కువ ఆశపడితేనే కదా అసంతృప్తి... (Sadguru Jaggi Vasudev | Speach)
PR
వాంగా అనే గొప్ప చిత్రకారుడుండేవాడు. తాను కురూపిని అనే భావన అతడిని ఎంతో బాధపెట్టేది. అందువల్ల బొమ్మలు చాలా అందంగా వేసి సంతోషించేవాడు. ఏ స్త్రీ అతని రూపాన్ని చూస్తే ఇష్టపడదు అని తెలీడం వల్ల, డబ్బిచ్చి స్త్రీలను రప్పించుకుని సుఖించేవాడు.

అలా వచ్చిన స్త్రీలలో ఒకామె....
" ఇంత డబ్బు తీసుకుని ఇతడిని ఒక్కమాట కూడా మెచ్చుకోకుండా వెళ్తే ఎలా..?" అన్పించింది. అదొక తప్పుగా తోచింది. అందువల్ల ఆమె వాంగాతో..." మీ చెవులు చాలా అందంగా ఉన్నాయి" అంది.

వాంగా సంతోషాన్ని పట్టలేకపోయాడు. తన రూపాన్ని మొట్టమొదటిసారిగా మెచ్చుకున్న ఆమెకో బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఆ మర్నాడు ఆమెకో పార్సిల్ వచ్చింది. దాన్ని విప్పి చూసిన ఆమె అదిరిపడి దాన్ని విసిరేసింది.

"నువ్వు మెచ్చుకున్న చెవులు తీసుకో.." అంటూ తన చెవులను కోసి పంపించాడు వాంగా. పూర్తిగా ఆశపడకుండా ముక్కలుముక్కలుగా కోరుకుంటే అవి లభించినా అదురుపాటు, ఆశ్చర్యమే మిగులుతాయి.
దీన్ని కూడా శోధించు: సద్గురు జగ్గీ వాసుదేవ్, సందేశం