ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ఇస్లాం > దేశం వ్యాప్తంగా రంజాన్ 'సందడే సందడి'
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశం వ్యాప్తంగా రంజాన్ 'సందడే సందడి'
FileFILE
ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ సంబరాలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడే సందడిగా ఉంది. పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా రంజాన్ ఉపవాస దీక్షలకు ముస్లింలు ముగింపు పలికారు. రాత్రంతా ఛార్మినార్, శాలిబండ, ఫత్తర్‌ఘట్టి. బెగంబజార్ తదితర ప్రాంతాలతో పాటు.. మక్కామసీదు, దేశ రాజధానిలోని జామా మసీదులు వేలాది మంది ముస్లిం సోదరులతో కిక్కిరిసి పోయింది. పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు.. దేశ వ్యాప్తంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి అన్సారీ, భాజపా అగ్రనేత అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలతో పాటు.. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిలు ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇస్లాం.. ఓ జీవన విధానం  
ముస్లింల పవిత్ర పండుగ "రంజాన్" (ఈద్‌-ముబారక్)
రంజాన్ విందు ప్రత్యేకత
పవిత్ర 'రోజా' ఉపవాసవ్రతం  
నిజమైన భక్తి భావం చాలా ముఖ్యం...!
హజ్‌యాత్ర కోసం 1.23 లక్షల మందికి అనుమతి