ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ఇస్లాం > త్యాగాలకు నెలవైనది మొహరం పండుగ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
త్యాగాలకు నెలవైనది మొహరం పండుగ
పవిత్రమైన పండుగగా మొహరంను ముస్లింలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేకించి ముస్లింలలోని షియాలు ఎక్కువగా జరుపుకునే ఈ పండుగతో ముస్లిం సంవత్సర ప్రారంభంగా భావించడం జరుగుతోంది. అలాగే త్యాగాలకు నెలవైనదిగాను ముస్లింలు ఈ నెలను భావిస్తారు.

మొహరం పండు
ఒక పవిత్ర లక్ష్యం కోసం బలికావడానికి సిద్ధపడిన మహ్మద్ ప్రవక్త పెద్ద కుమారుడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ సంస్మరణార్థం ఈ పండుగను చేసుకుంటారు. క్రీ.శ 680లో ఇరాక్‌లోని కర్బాలాలో జరిగిన ప్రతిఘటన లేని ఒక శాంతి యుద్ధంలో ఆయన మరణించారు. హజ్రత్ ఇమామ్ తన కుటుంబ సభ్యులు, అనుయాయులతో కలిసి ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యంలో అప్పటి ముస్లిం రాజైన యాజిద్ సైనికులు వారిని నిర్భంధించారు.

చాలా కాలం పాటు వాళ్లు అలా నిర్బంధంలో ఉండిపోవడంతో ఆకలి, దాహార్తితో మరణించారు. ఈ వివాదం ముస్లింలలో వివిధ ప్రశ్నలను రేకెత్తించింది. ముస్లింలలో కొంత మంది ఈ ఉదంతంపై ప్రత్యేక సమావేశాలను, చర్చలను జరిపారు. ఈ ప్రక్రియలో వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకించి షియాలు పండుగగా ఎంతో పవిత్రంగా చేసుకుంటారు.

పది రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. షియా వర్గాలు అక్కడక్కడ నీళ్లు, పళ్ల రసాలు వంటి వాటిని ఈ పదిరోజులూ ఉచితంగా అందరికీ అందజేయడం ఈ పండుగలోని ప్రత్యేకం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దేశవ్యాప్తంగా మొహరం కోలాహలం
ముహర్రం పండుగ
బక్రీద్ పండుగ....త్యాగానికి ప్రతీక
చార్మినార్‌ పరిసరాలు కళకళ
దేశం వ్యాప్తంగా రంజాన్ 'సందడే సందడి'
ఇస్లాం.. ఓ జీవన విధానం