హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » ఇస్లాం » ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: ఒబామా (President Obama | Ramadan message | Muslims | world | United States)
 
FILE
అమెరికా మరియు ప్రపంచవ్యాప్తంగానున్న ముస్లిం సోదరులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అతి పవిత్ర మాసమైన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెల ప్రారంభమైనప్పుడు అమెరికా అధ్యక్షుడు అంకారా మరియు కైరో పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన అల్ అరేబియా మరియు డాన్ టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చి తన సందేశాన్ని ముస్లిం ప్రజలకు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను అమెరికా ప్రజల తరపున అమెరికా మరియు ప్రపంచవ్యాప్తంగానున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు చెపుతున్నానని ఆయన తెలిపారు.

ప్రతి సంవత్సరం చాంద్రమానం ప్రకారం ముస్లింల క్యాలెండర్‌లో తొమ్మిదవ నెలైన రంజాన్‌ మాసంలో ప్రపంచవ్యాప్తంగానున్న ముస్లింలు ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు. రంజాన్ మాసంలో ఆచరించే అతి ముఖ్యమైన ఆరాధన " రోజా "... అంటే ఉపవాసం అన్నమాట. ఉపవాసాన్ని పాటించడమనేది అన్ని ధర్మాలలోను ఉంది. ఈ ఉపవాసం కారణంగా మనిషి ఆధ్యాత్మికంగా, క్రమశిక్షణతో, భగవంతునికి ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుని కృపకు పాత్రులయ్యేందుకు తోడ్పడుతుంది.

అలాగే రంజాన్ నెలలో ఉపవాసాలుండే ప్రజలు దేవుని కృపకు పాత్రులవుతారు. అమెరికా ముస్లింలు ఈ నెల ప్రారంభంలోనే దేశంలోని పేద, నిస్సహాయులకు సేవలు, దానాలు చేయడం ప్రారంభించారని ఒబామా తెలిపారు. దేశంలోని ముస్లింలకే కాకుండా ప్రపంచంలోనున్న ముస్లింలను తాము గౌరవిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
FILE


ఇది ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి రంజాన్ మాసం. అమెరికా మరియు ప్రపంచంలోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ... ముస్లిం సామ్రాజ్యంలో ఎలాంటి రాజకీయాలుండవని, దైవాన్ని నమ్ముకునేవారని ఒబామా కొనియాడారు. గతంలో ప్రపంచవ్యాప్తంగానున్న ముస్లిం సోదరులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించారని, అటు విద్యారంగం, సైన్స్ మరియు సాంకేతిక, ఆరోగ్య రంగాలలో తమ నిపుణతను చాటుకున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అదే విధంగా భవిష్యత్తులోను ప్రపంచంలోని పేదలకు సహాయ సహకారాలు అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాసాలను ఉదయాత్పూర్వం ప్రారంభించి సూర్యాస్తమయం తర్వాతే ఉపవాస దీక్షను ముగిస్తారు. ఈ ఉపవాసంలో అన్న పానీయాలు త్యజించడం, లైంగిక వాంఛలకు దూరంగా ఉండటమే ప్రధానాంశం. ఆకలిదప్పులతో అల్లాడే దీన జనుల కష్టాన్ని గుర్తించేందుకు ధనవంతులకు ఇది ఓ అవకాశమని ప్రవక్త చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.