హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » ఇస్లాం » ముస్లింల పవిత్రమాసం మాహే రంజాన్ (World wide | Muslims | Festival | Ramadan | Moon | Taraveeh Namaz | Fasting)
 
FILE
ముఫై రోజుల వరకు కొనసాగే ఈ నమాజు చదివించే ఇమాం ఖురాన్‌లోని సూరాలను నమాజులో వినిపిస్తారు. రంజాన్‌ మాసంలోని 30 రోజుల్లో అత్యంత ప్రధానమైనది 26వ రోజు రాత్రి. దీనినే ముస్లింలు సతావీహ్ కీ రాత్ అంటారు.

ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్‌ ఈ రోజునే అవతరించిందని ముస్లింలు ప్రగాఢ విశ్వాసం. ఈ 26వ రోజు రాత్రిని షబ్‌-ఎ-ఖదర్‌గా పిలుస్తారు. షబ్‌-ఎ-ఖదర్‌ రాత్రి ముస్లింలందరూ జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఈ రాత్రి భక్తి శ్రద్దలతో ప్రార్థనలు జరిపితే వారు గతంలో చేసిన పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం.

భక్తితో కఠోర దీక్షతో ప్రార్థనలు చేసేవారికి 84 సంవ త్సరాలు (1001నెలలు) ప్రార్థనలు చేసి న దానికి సమానమైన పుణ్యం లభి స్తుందని నమ్ముతారు. రంజాన్‌ మాసంలో వచ్చే చివరి శుక్రవారాన్ని జుమాతుల్‌ విదాగా పిలుస్తా రు. అంటే రంజాన్‌ నెల ముగుస్తుందని అర్థం.

ఈ జుమా నమాజ్‌లో చాలా సంఖ్యలో ముస్లింలు మసీదులలో చేరుకుని ప్రార్థనలు జరుపుతారు. అరబ్బిలో ‘అల్‌విదా’ అంటే 'వీడ్కో లు’ అని అర్థం. జుమా అంటే శుక్రవారం. అందుచే దీనిని ‘జుమాతుల్‌విదా’ అంటారు.
FILE


నెల రోజులపాటు జరిగే ఈ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లింలు తమ సంపాదనలో విధిగా ‘జకాత్‌’ (తమ ఆస్థిలో కొంత మొత్తాన్ని పేదలకు పంచిపెట్టడం) ఆచరించాలని పవిత్ర ఖురాన్‌ బోధిస్తుంది. ఖురాన్‌ బోధనల ప్రకారం ముస్లింలు రంజాన్‌ మాసంలో దానధర్మాలు చేస్తుంటారు. క్రమశిక్షణకు, ఓర్పుకు, సహనానికి మారు పేరైన ఇస్లాం మతంలోని ముస్లింలకు ఈనెలలో ఆ లక్షణాలు అద్దంపట్టేట్లు కనిపిస్తాయి.

దీక్ష విరమణ తరువాత ఆహారపదార్థాలు ఏవి తిన్నా దీక్ష మాత్రం ఖర్జూరం (ఖజూర్‌)తో విరమించడం సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఇస్లాం మత ప్రవక్త ముహ్మద్‌ కాలంనాటి నుండి వస్తున్నదని ముస్లింలు పేర్కొంటారు. చంద్రుడు కనిపించగానే అరబిక్‌ మాసం షవ్వాల్‌ ఒకటో తేదీన రంజాన్‌ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.