హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » ఇస్లాం » రంజాన్ ఉపవాస వ్రతాన్ని పాటిస్తున్నారా? ఐతే ఇలా ఉండాలి (Islam| Ramadan| Muslims| Upavasa| Allah)
 
Ramadan
FILE
మహమ్మదీయులకు పవిత్ర మాసమైన "రంజాన్" నెలలో ఉపవాస వ్రతాన్ని ఆచరించే వారు కొన్ని నియమాలను పాటించాలని ఇస్లాం పెద్దలు అంటున్నారు. రంజాన్ మాసమంతటా ఉపవాసముండే మహమ్మదీయులు ఆహారంపై ధ్యాస పెట్టకుండా అల్లాను స్మరిస్తూ ఉండాలి.

అయితే రంజాన్ మాసంలో ఉపవాసముండే మహమ్మదీయుల్లో కొందరు భోజనాన్ని మాత్రం వదిలి పెడితేనే ఉపవాస వ్రతాన్ని ఆచరించినట్లవుతుందని భావిస్తారు. అంతేగాకుండా.. వ్రతానికి విరుద్ధంగా అసత్యాలు పలకడం, దుశ్చర్యలకు పాల్పడడం, ఇతరులతో దూషణలకు దిగడం వంటివి చేస్తుంటారు.

ఇలాంటి వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసమున్నా ఫలితం దక్కదని ప్రవక్త సూచించారు. ఉపవాసంతో పాటు భక్తి శ్రద్ధలతో అల్లాను స్మరించేవారికి ఆ దేవదేవుడు అన్ని విధాలా సహకరిస్తాడని భక్తుల విశ్వాసం.

ఈ రంజాన్ ఉపవాస వ్రతం గురించి.. ముహమ్మద్ ప్రవక్త (సఅస) ఇలా పేర్కొన్నారు. ఉపవాస వ్రతాన్ని ఆచరించే ఏ భక్తుడు అసత్యాలు పలకడాన్ని, దుశ్చర్యలకు పాల్పడడాన్ని విరమిస్తాడో.. అతడే ఆ పరమాత్మకు సన్నిహితుడవుతాడని చెప్పారు.

ఉపవాస వ్రతానికి సంబంధించి పవిత్రతను అర్థం చేసుకుని నబీ చూపించిన మార్గంలో పయనించే వారికి అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని మహమ్మదీయుల నమ్మకం.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.