హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » ఇస్లాం » షబ్-ఏ-కద్ర్ విశేషమేంటంటే...! (Islam religion | Muslim | fasting | Allah | Islam | Ramadan month | Roja | Holy Khuran | Sehri | Iftair)
 
FILE
ముస్లింలు జరుపుకునే రంజాన్ పండుగకు సంబంధించి రంజాన్ నెలలోని చివరి రోజుల్లో ప్రార్థనల పరంపర తీవ్రతరమౌతుంది. ముస్లింలు రంజాన్ నెలలోని చివరి పది రోజులలో ప్రార్థనలను ముమ్మరం చేస్తుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లోని రాత్రుల్లో షబ్-ఏ-కద్ర్ కూడా దాగి ఉంది. దేవుని కృప ఈ రాత్రుల్లోనే దాగుందని ముహమ్మద్ ప్రవక్త (సఅస) చెప్పినట్లు ఖురాన్ చెపుతోంది. దేవుని కృపను పొందేందుకుగాను ప్రతి ముస్లిం నమాజును కొనసాగిస్తుంటారు.

షబ్-ఏ-కద్ర్‌‌ను చివరి పదిరోజుల్లో అంటే రంజాన్ నెలలోని 21, 23, 25, 27 లేదా 29 తేదీల్లో ఎప్పుడైనా పాటించవచ్చని అల్లాహ్ చెప్పినట్లు ముహమ్మద్ ప్రవక్త (సఅస) సూచించారు. ఈ రోజుల్లో రాత్రి జాగారం చేసి నమాజు చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలు, తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని అల్లాహ్ క్షమించేస్తాడని ఖురాన్ చెపుతోంది.

ప్రజలు తమ సౌకర్యార్థం 27వ తేదీని అంటే ఇక్కడ ఇరవై ఆరవ తేదీ రాత్రి జాగరణ చేసి నమాజును కొనసాగిస్తుంటారు. ఈ ఇరవై ఆరవ తేదీ రాత్రినే సతాయీస్‌వీఁ రాత్ లేదా షబ్-ఏ-కద్ర్ అని అంటారు. ఈ షబ్-ఏ-కద్ర్ రోజు రాత్రి పూర్తిగా జాగరణ చేస్తూ...నమాజును కొనసాగిస్తుంటారు ముస్లింలు.

ఈ నెలలో వచ్చే చివరి శుక్రవారానికి వీడ్కోలు పలికేందుకు తగిన సన్నాహాలు తీసుకుంటుంటారు. ప్రస్తుతం రంజాన్ నెలలోని చివరి శుక్రవారం (18 సెప్టెంబర్) నాడు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. ప్రధానంగా ఈ పండుగను సాంప్రదాయబద్దంగా జరిపేవారు షబ్-ఏ-కద్ర్ రాత్రిని ఓ పండుగలా జరుపుకొంటుంటారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.