| ఇంకా చదవండి |
| భారతీయ సంస్కృతిలోని విభన్నతే అంతర్లీనంగా దాని ఏకత్వాన్ని అనుసంధిస్తున్న సూత్రం. వేలాది సంవత్సరాల కాలగమనంలో రూపుదిద్దుకొంటూ వచ్చిన వివిధ కళారూపాలు దేశంలోని విభిన్నసంస్కృతుల ప్రతిబింబాలే కాదు, ఆధ్యాత్మిక ప్రేరకాలు కూడా. ఇవన్నీ ఈ దేశాన్ని వేలాది సంవత్సరాలుగా సుసంపన్నం చేస్తూ వచ్చాయి. అయితే, ఇప్పటి మన జీవిత ఉరవడిలో అతిశీఘ్రంగా కనుమరుగై మన స్తృతిపథం నుంచి మాయమవుతున్నాయి. | అలర్‌మేల్ వల్లి: భారతీయ శాస్త్రీయ నృత్య రీతుల్లో ఆణిముత్యం వంటి భరతనాట్యంలో పందనల్లూరు శైలి నృత్యసాంప్రదాయంలో నిష్ణాతురాలు. ప్రత్యేకంగా ఆమె ప్రదర్శించే శైలి ఎందరో ప్రముఖుల ప్రశంసలనందుకుంది. 1991లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడంతో నాట్యరంగంలో ఇంత చిన్నవయసులో ఈ అవార్డు అందుకొన్న కళాకారిణిగా ఖ్యాతిపొందారు. 2001లో సంగీత నాటక అకాడెమీ అవార్డు, 2004లో పద్మభూషణ్ అవార్డుల సత్కారం కూడా పొందారు. |