ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » దేవీ నవరాత్రి ఉత్సవాలు » స్వర్ణకవచాలంకృత అవతారంలో కనకదుర్గమ్మ (Religion| News| Bejawada| Kanakadurga| Indrakiladri| Devotees| Darshan)
 
Durga
FILE
ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రుల సందర్భంగా స్వర్ణకవచాలంకృత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. నవరాత్రులలో తొలిరోజైన శనివారం ఉదయం 8.30 గంటల నుంచి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి సర్వదర్శనం ప్రారంభమైంది.

తొలుత రాష్ట్ర మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం బెజవాడ దుర్గమ్మ తల్లి ఆలయ నిర్వాహం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.