నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం కనకదుర్గమ్మ తల్లి లలితాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తోంది. చెరుకుగడ, విల్లు, పాశాంకులను ధరించి రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతిదేవి సేవలు చేస్తుండగా లలితాదేలవి భక్తులకు అనుగ్రహమిస్తోంది.
మరోవైపు నవరాత్రులను పురస్కరించుకు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు కనకదుర్గమ్మ దర్శించుకుంటున్నారని ఆలయ బోర్డు వెల్లడించింది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు.
ఇదిలా ఉండగా.. పీఎస్ఎల్‌వి-సీ 14 ఉపగ్రహం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ బుధవారం ఉదయం సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక అలంకారాలు, పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయని ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.