ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » దేవీ నవరాత్రి ఉత్సవాలు » "మహాలక్ష్మీదేవి"గా దర్శనమిస్తోన్న కనకదుర్గమ్మ! (Religion| Kanaka Durga| Mahalakshmi| Navratri| Indrakiladri| Bezawada| VijayaWada)
 
Lakshmi Devi
FILE
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ తల్లి గురువారం సర్వసంపదలను ఒసగే శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లిని లక్ష్మీదేవి అలంకరణలో దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.

నవరాత్రుల్లో ఆరో రోజైన గురువారం కనకదుర్గమ్మ మహాలక్ష్మిగా కలుపపూవుపై ఆసీనురాలై భక్తులను అనుగ్రహిస్తోంది.

ఇదిలా ఉంటే... తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన సత్యవెంకటభాను ప్రకాష్ రెడ్డి బుధవారం కనకదుర్గమ్మకు మూడున్నర కాసుల మంగళసూత్రాలను బహూకరించారు. మార్గశిర పౌర్ణమి, కార్తీక, శ్రావణ, వైశాక పౌర్ణమిలో ఏదో ఒకరోజున తాము బహూకరించిన ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించాలని వారు ఈఓను కోరారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.