ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » దేవీ నవరాత్రి ఉత్సవాలు » కనకదుర్గమ్మ స్వరూపంలో బెజవాడ అమ్మవారు..! (Religion| Kanaka Durga| Navratri| Indrakiladri| Bezawada| VijayaWada)
 
Durga
FILE
ఇంద్రకీలాద్రిపై వెలసిన దేవదేవి శనివారం అష్టమ తిథినాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. శరన్నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారిని దుర్గమ్మ తల్లిగా అలంకరించేందుకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో అమ్మవారిని దర్శనాన్ని నిలిపివేశారు.

దుర్గతులను నివారించే శక్తి రూపమైన దుర్గాదేవి.. దివ్యఅలంకరణతో భక్తులను అనుగ్రహిస్తోంది. దివ్యప్రభలతో వెలుగొందుతోన్న ఈ దుర్గమ్మ తల్లి దుర్గముడనే రాక్షసుడిని సంహరించింది.

ఆది ప్రకృతి పంచమహా స్వరూపాల్లో దుర్గమ్మ మొదటిది. ఈ మాతను పూజిస్తే సర్వబాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దుర్గమ్మ స్వరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల భయాలు పోతాయని ప్రతీతి. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కొండకు తరలి వచ్చారు. అశేష భక్తజనంతో నిండిపోయిన ఇంద్రకీలాద్రిపై మహానవమి (ఆదివారం) ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఇంద్రకీలాద్రిపైన క్యూలైన్ల పక్కన ఉన్న ఏసీ నుంచి మంటలు రావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే.. యధావిధిగా క్యూలైన్ కొనసాగుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.